'సంగమర్మర్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితులలో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో రూపొందిన ఈ సిరీస్, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి హిందీతో పాటు ఇతర భాషలలోను అందుబాటులోకి వచ్చింది. సౌరభ్ రాజ్ .. షీన్ సవితా దాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కథ ఏమిటనేది చూద్దాం.
'ఆగ్రా'లో నీరజ్ గోయెల్ అనే వ్యాపారి ఉంటాడు. అతని భార్యనే వసుంధర. వారి సంతానమే అమృత ( షీన్ సవితా దాస్) అభినవ్ .. ప్రీతి .. చారు. అదే కాలనీలో ఆదిత్య (సౌరభ్ రాజ్) తన తల్లి నిర్మలతో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఒక చిన్న క్లినిక్ పెట్టుకుని డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతను .. అమృత ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక 'హోలీ' పండుగ రోజున ఈ విషయం వసుంధరకి తెలుస్తుంది. ఆదిత్య మంచివాడనే అభిప్రాయం ఉండటం వలన ఆమె అమృతను మందలించలేకపోతుంది.
వసుంధర భర్త నీరజ్ గోయెల్ తన స్థాయికి మించిన ఒక ప్రాజెక్టును మొదలుపెడతాడు. అందుకోసం పెద్ద మొత్తంలో అప్పులు చేస్తాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోతుంది. దాంతో అప్పుల వాళ్లు తమ బాకీ చెల్లించమని వేధిస్తూ ఉంటారు. ఈ విధమైన సమస్యలతో అతను సతమతమవుతూ ఉంటాడు. ఆదిత్యతో అమృత పెళ్లి విషయం గురించి నీరజ్ తో మాట్లాడాలని వసుంధర అనుకుంటుంది. అయితే ఆ విషయం చెప్పకుండానే హార్ట్ ఎటాక్ తో ఆమె చనిపోతుంది.
అసలే సమస్యల్లో ఉన్న నీరజ్, భార్య మరణంతో మానసికంగా మరింత దెబ్బతింటాడు. తండ్రి ఆందోళనకి కారణం తెలుసుకున్న అమృత, ఆయనని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను సూసైడ్ చేసుకోవడంతో అయోమయంలో పడుతుంది. ఒక వైపున ఇంటిమీదకి వచ్చే అప్పులవాళ్లు .. ఒక వైపున పదేళ్లలోపు వయసున్న తమ్ముడు .. చెల్లెళ్లు. అవసరానికి ముఖం చాటేసిన బంధువులు. అలాంటి పరిస్థితులలో అమృత ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఆదిత్యతో ఆమె వివాహం జరుగుతుందా? లేదా? అనేది మిగతా కథ.
అమ్మా .. నాన్న .. తోబుట్టువులు .. ఆర్ధికపరమైన ఇబ్బదులు లేని జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది. కోరుకున్న వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోబోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. అంతా అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటే, తమకంటే అదృష్టవంతులు లేరని అనిపిస్తూ ఉంటుంది. అయితే అదంతా గతంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు .. కాలం ఎప్పుడూ ఒక్క రీతిగా ఉండదనే విషయాన్ని చాటే కథ ఇది.
ప్రేమ .. కుటుంబ బంధాలు .. ఎమోషన్స్ .. ఆశలు .. ఆశయాల చుట్టూ తిరిగే కథ ఇది. కథ మొదలైన తీరును బట్టే ఇది కాస్త విస్తారమైనదనే విషయం మనకి అర్థమైపోతుంది. ప్రధానమైన పాత్రలు రెండే అయినా, ముఖ్యమైన పాత్రల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఆరంభంలోనే ఈ పాత్రలను పరిచయం చేస్తూ వెళ్లారు. ఆ పాత్రలు ఎంట్రీ ఇచ్చిన తరువాత కథ నిదానంగా .. నిలకడగా సాగడం మొదలవుతుంది.
అందమైన జీవితంలో నుంచి అగాధంలోకి జారిపోయిన అమ్మాయి. తన తండ్రి మరణానికి ఒక మర్యాదను తీసుకురావాలని అనుకున్న అమ్మాయి. తన తోబుట్టువులకు తానే అండగా నిలవాలని నిర్ణయించుకున్న అమ్మాయి. అలాంటి ఆమె చేయి అందుకోవాలని అనుకున్న అబ్బాయికి కలిసిరాని పరిస్థితులు. కుటుంబం కోసం ఆమె .. ఆమె కోసం అతను .. ఇద్దరి మధ్య జరిగే మానసిక సంఘర్షణ ప్రధానంగానే ఈ కథ నడుస్తుంది.
ఈ కథలో ముఖ్యమైన పాత్రలు చాలానే కనిపిస్తాయి. ఆ పాత్ర స్వరూప స్వభావాలను డిజైన్ చేసిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. పాత్రలు తరచూ కనెక్ట్ అవుతూ .. వాస్తవానికి దగ్గరలోనే ప్రేక్షకులను ఉంచుతుంటాయి. లవ్ .. రొమాన్స్ తో పాటు ఎమోషన్స్ ను కనెక్ట్ చేసిన తీరు బాగుంది. కాకపోతే, కథనం చాలా నిదానంగా నడుస్తూ ఉంటుంది. అందుకు కారణం మరిన్ని ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ నుంచి రానుండటమే అనుకోవాలి.
రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా జోనర్ కి తగినట్టుగానే ఈ సిరీస్ కొనసాగింది. ఆయా సందర్భాలను బట్టి లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ ను దర్శకుడు కనెక్ట్ చేయగలిగాడు. ఫొటోగ్రఫీ బాగుంది .. పాటలతో పాటు ఫీల్ తో కూడిన సన్నివేశాలను ఆవిష్కరించిన సందర్భాలలో కెమెరా పనితనం మార్కులు కొట్టేస్తుంది. నేపథ్య సంగీతం కూడా సందర్భానికి తగినట్టుగా సాగుతుంది. ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది.
ఒంటరితనం పోరాటం నేర్పుతుంది .. ఓటమిలో నుంచే ఏదో ఒక రోజున గెలుపు పుడుతుంది. అనే విషయన్ని చాటే కథ ఇది. నిజమైన ప్రేమ మాత్రమే నీడలా మారిపోయి తోడుగా నడుస్తుంది. నిరీక్షణను కూడా అందమైన జ్ఞాపకంగా మార్చుకుంటుంది అనే నీతి ఈ కథలో కనిపిస్తుంది. ప్రతి గురువారం ఒక ఎపిసోడ్ చొప్పున వదిలే ఈ సిరీస్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పచ్చు.

Movie Details
Movie Name: Sangamarnar
Release Date: 2026-02-26
Cast: Sourabh Raj jain, Sheen Doss, Avinash, Smitha Mohla, Joya Ojha
Director: Vikram Ghai
Producer: Jyothi Desh Pande
Music: -
Banner: A Rajashri Productions
Review By: Peddinti
Trailer