ఫాంటసీ కథతో వచ్చిన సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తాయి. ఇలాంటి సినిమా సక్సెస్ సాధిస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్లకు కూడా కొదువ ఉండదు. ఇలాంటి ఓ ఫాంటసీ కథాంశంతో రూపొందిన చిత్రమే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో కార్తీకేయ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించాడు. ఈసినిమాపై విడుదలకు ముందే హీరో మహేష్ బాబు, ఎన్టీఆర్‌లు ప్రశంసలు కురిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' చిత్రం కథాంశం ఏమిటి? ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
సూరి (ఫహద్ ఫాజిల్) అనాథ. స్నేహితుడు (వెంకటేష్ కాకునూరు)తో కలిసి ఉంటాడు. డబ్బు కోసం అంబులెన్స్‌ను నడుపుతుంటాడు. ఎలాగైనా డబ్బు సంపాందించి జీవితంలో సెటిల్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగానే ఓ గొర్రె పొట్టేల్ పోటీలో అస్లాం భాయ్ పొట్టేల్‌ను మోసం చేసి ఓడించి చిక్కుల్లో ఇరుక్కొంటాడు. అస్లాం భాయ్ గ్యాంగ్ సూరి నుంచి 25 లక్షలు డిమాండ్ చేస్తుంది. లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించండంతో దాంతో డబ్బు ఎలాగైనా అస్లాం భాయ్ గ్యాంగ్‌కు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక రిచ్ ఫ్యామిలీకి చెందిన చిన్న పిల్లలని ఎవరైనా కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుల్లో రూ.25 లక్షలు అస్లాం గ్యాంగ్‌కి ఇచ్చేసి, మిగిలిన డబ్బులతో దుబాయ్ వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు.
అలాంటి సమయంలోనే సంపన్న కుటుంబానికి చెందిన చిన్నారి దివ్య (సారా పాలేకర్) తన అమ్మనాన్నలను తానే మాయం చేశాననీ, వాళ్లను కనిపించేలా చేయాలని అడిగిన దివ్యను, కుక్క స్నూపీని సూరి ఓ ప్లాన్‌తో తన వెంట తీసుకెళ్లి కిడ్నాప్ పథకం మొదలుపెడతాడు. ఇక సూరి పథకం ఫలించిందా? దివ్య తల్లిదండ్రులు ఎవరు? తన అమ్మనాన్నలను తానే మాయం చేశానని దివ్య ఎందుకు చెబుతుంది? చివరికి ఏం జరిగింది? అమ్మనాన్నల్ని కలుసుకోవాలన్న దివ్య కోరికను సూరి నెరవేర్చాడా? అనేది చిత్ర కథ.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాంటసీ కథాంశంతో చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి కథాంశాలను ప్రేక్షకాదరణ పొందేలా డీల్ చేయడం.. నిర్మించడం రెండూ కష్టమే. అయితే ఒకవేళ ఇలాంటి సినిమా ప్రేక్షకులకు నచ్చిదంటే దాని రిజల్ట్ కూడా అనూహ్యంగా ఉంటుంది. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' కూడా ప్రేక్షకులకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఓ ఫాంటసీ కథతో తెరకెక్కింది. అయితే కథాంశం, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా... ఈ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పుడు దానికి తగ్గ స్క్రీన్‌ప్లే, ఎమోషన్.. అన్నీంటికి మించి ఆ కథను ఎగ్జిక్యూట్ చేసే ప్రతిభ కలిగి ఉండాలి..
ఈ సినిమా విషయంలో కాన్సెప్ట్ ఓకే.. రచనా పరంగా స్ట్రాంగ్‌గా ఉంటే బెటర్ అవుట్‌పుట్ వచ్చే స్కోప్ ఉండేది. బట్ కథను అత్యంత బోరింగ్‌గా చెప్పడమే ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద మైనస్.స్లో నేరేషన్.. వీక్ సీన్స్.. వల్ల ఎక్కడా కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపించదు సరికదా.. ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంది.ఫస్టాఫ్ సో..సో..గా సాగిన ఈ సినిమా సెకండాఫ్‌లో మరింత బోరింగ్‌గా, ట్రాక్ తప్పిన సినిమాలా అనిపించింది. సినిమా మొదలైన 20 నిమిషాల్లోనే ఈ సినిమా ఎటు వెళుతుంది? ఏమీ చూపించబోతున్నారు అనే అసహనంతోనే సినిమా అంతా ప్రేక్షకుడు భరించాల్సి వస్తుంది. ప్రతి సన్నివేశం సాగదీతగా.. స్లోగా నత్తనడకన సాగుతుంది.
సినిమాలో హాస్యం, ఎమోషన్ ఎక్కడా కూడా వర్కవుట్ కాలేదు. సూరి, దివ్య క్యారెక్టర్‌తో ఆడియన్స్ ఎంత ప్రయత్నించినా కనెక్ట్ కాలేరు. పతాక సన్నివేశాల్లో ఎమోషనల్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫల ప్రయత్నంలానే మిగిలిపోయింది. రచనా పరంగా ఈ సినిమా చాలా బలహీనంగా కనిపించింది. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌కు తగ్గ స్క్రీన్‌ప్లేను, సన్నివేశాలను రచించడంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది. ఓవరాల్‌గా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్స్తోనే సాగింది జర్నీ..!
సూరి పాత్రలో ఫహద్ ఫాజిల్ ఎందుకో సెట్ కాలేదని అనిపిస్తుంది. ఆయన నటనకు వంక పెట్టే స్కోప్ లేకపోయినా ఆయన పాత్ర చిత్రణలోనే లోపం కనిపిస్తుంది.? అసలు ఫహాద్ ఈసినిమాను ఎలా ఒప్పుకున్నాడు అనే ఆశ్చర్యం.. అతను ఈ సినిమా చేయాల్సినంత కంటెంట్ ఇందులో ఏముంది అనే సందేహం సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.తొలిసారిగా ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ లాంటి గొప్ప నటుడి నటన కూడా ఎంతో సాధారణ స్థాయిలో కనిపించింది. దివ్యగా సారా పలేకర్ చాలా క్యూట్‌గా ఉంది.. స్క్రీన్ మీద ముద్దుగా, అమాయకంగా నటించింది.. కాలభైరవ సంగీతం ఫర్వాలేదనిపించింది. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాలి. నిర్మాణ విలువలు కనిపించాయి.
ఓవరాల్‌గా ఈ ఫాంటసీ కథ బోరింగ్ అండ్ సాగదీత సన్నివేశాలతో ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టేలా..ట్రబుల్స్తోనే సాగిన విఫల ప్రయాణంలా అనిపిస్తుంది.
''డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'' మూవీ రివ్యూ
Don't Trouble the Trouble Review
Movie Details
Movie Name: Don't Trouble the Trouble
Genre: Adventure
Release Date: 2026-10-02
Cast: Fahadh Faasil, Ssara, Saurabh Sachdeva and others
Director: Shashank Yeleti
PRO: vamsi kaka
Music: Kaala Bhairava
Banner: Arka Media Works
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer