రజనీ 'జైలర్ 2'.. తప్పకుండా చూడాలన్న ధనుశ్!
- నేడు థియేటర్లలోకి వచ్చిన 'జైలర్ 2' చిత్రం
- బ్లాక్ బస్టర్ సినిమా అంటూ ధనుశ్ ప్రశంసలు
- తలైవా ఫ్యాన్స్‌కు ఇదొక పెద్ద పండగన్న సినీ ప్రముఖులు
- దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్‌పై ప్రశంసల వర్షం
- ప్రతి యాక్షన్ బ్లాక్ అదిరిపోయిందన్న తెలుగు నిర్మాత నాగవంశీ
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్ 2' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచే ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, నటుడు ధనుశ్ ఈ సినిమాను "మస్ట్ మస్ట్ మస్ట్ వాచ్" మూవీ అని అన్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వెంటనే తన 'ఎక్స్' ఖాతాలో స్పందించిన ధనుశ్.. "'జైలర్ 2' తప్పకుండా చూడాల్సిన సినిమా.. ఇది బ్లాక్‌బస్టర్.. తలైవా అభిమానులకు ఇదొక పండగ" అని పేర్కొంటూ ఫైర్ సింబల్స్ పోస్ట్ చేశారు. ధనుశ్ తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, నటుడు విష్ణు విశాల్, నిర్మాత నాగవంశీ వంటి ప్రముఖులు కూడా సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ.. "తెరపై తలైవా మంటలు పుట్టించారు. ఆయన నుంచి కళ్లు తిప్పుకోలేకపోయాను. గూస్బంప్స్ ఓవర్‌లోడెడ్ మాస్ బ్లాస్ట్ ఇది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రైటింగ్, ఎగ్జిక్యూషన్ అద్భుతం. అనిరుధ్ తన సంగీతంతో ప్రతి ఫ్రేమ్‌కు ప్రాణం పోశారు. ఒకే సినిమాలో మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, విద్యాబాలన్, హృతిక్ రోషన్, ఎస్జే సూర్య వంటి వారిని చూడటం అద్భుతంగా ఉంది" అని కొనియాడారు.
తెలుగు నిర్మాత నాగవంశీ సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. "సూపర్‌స్టార్ సినిమా విషయానికి వస్తే ఫస్టాఫ్, సెకండాఫ్ పోలికలకు తావులేదు. ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద పెద్ద ధమాకా ఖాయం. 'జైలర్ 2' ఆద్యంతం పీక్ మాస్ సంభవం లాంటి మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రతి యాక్షన్ బ్లాక్ అదిరిపోయింది. ఇది కుటుంబ ప్రేక్షకులకు పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్" అని అన్నారు.
దర్శకుడు నెల్సన్ రజనీకాంత్‌ను ప్రజెంట్ చేసిన విధానం, కథ, భావోద్వేగాలు అన్నీ పక్కాగా కుదిరాయని తెలిపారు. అనిరుధ్ సంగీతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. "రజనీ సర్ స్క్రీన్‌పై వెలిగిపోతుంటే, అనిరుధ్ తన పాటలు, బీజీఎంతో ప్రతి క్షణాన్ని ప్యూర్ ఫైర్వర్క్స్లా మార్చేశాడు" అని పేర్కొన్నారు.