అన్ని అపాయింట్‌మెంట్లు రద్దు చేసుకున్న అమిత్ షా.. భద్రతా వలయంలో ఢిల్లీ!
- సీఈసీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల భారీ నిరసనలకు పిలుపు
- ఢిల్లీలో 20 వేల మంది బలగాలతో కఠిన భద్రతా ఏర్పాట్లు
- 57 మెట్రో స్టేషన్ల మూసివేయాలన్న పోలీసులు.. పలు రైళ్ల సర్వీసులు రద్దు
- జంతర్ మంతర్ వద్ద నిరసనకు పోలీసుల అనుమతి నిరాకరణ
- పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్షలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష ఇండియా కూటమి తలపెట్టిన భారీ నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 20,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించి, దేశ రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక పర్యటనలు, అపాయింట్‌మెంట్లు రద్దు చేసుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ఈరోజు జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
భద్రతా చర్యల్లో భాగంగా, ఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లను రెండు రోజుల పాటు మూసివేయాలని పోలీసులు మెట్రో అధికారులను కోరారు. అలాగే, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చే పలు రైళ్లను ఈరోజు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జంతర్ మంతర్ పరిసరాల్లో సీసీటీవీలు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నివాసం, ఈసీ కార్యాలయం వద్ద ఇప్పటికే ఉన్న జడ్+ భద్రతతో పాటు భారీగా భద్రతను పెంచారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీకి వస్తున్న తమ కార్యకర్తలను నాగ్‌పుర్, భోపాల్ వంటి నగరాల్లోనే పోలీసులు అడ్డుకుంటున్నారని సీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.