ఆస్ట్రేలియాలో బీజేపీ చీఫ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ.. ఫొటోలు వైరల్
- బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావుతో మల్లారెడ్డి భేటీ
- వీరి సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా హాజరు
- రాంచందర్‌రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఈ భేటీ
- నేతల భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాంచందర్‌రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా, అక్కడే ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం.
ఆస్ట్రేలియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ముగ్గురు నేతలు కలుసుకున్నారు. వేర్వేరు రాజకీయ పక్షాలకు చెందిన ఈ నేతలు ఒకేచోట సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సమావేశంపై జోరుగా చర్చ జరుగుతోంది.