భారత్‌-పాక్‌ వివాదాలను పరిష్కరించే అంతర్జాతీయ వ్యవస్థే లేదు: అమెరికా

భారత్‌-పాక్‌ వివాదాలను పరిష్కరించే అంతర్జాతీయ వ్యవస్థే లేదు: అమెరికా

No international system exists to resolve India Pakistan disputes says USA
  • భారత్‌-పాక్‌ వివాదాన్ని ప్రస్తావించిన రూబియో
  • అంతర్జాతీయ వ్యవస్థ పనిచేయడం లేదని వ్యాఖ్య
  • ఐరాస తన పరిధి దాటుతోందని విమర్శ
  • దేశాలు తమ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాయన్న రూబియో
  • భారత్‌-పాక్‌ కాల్పుల విరమణపై ట్రంప్‌ మళ్లీ వ్యాఖ్యలు
భారత్‌-పాకిస్థాన్‌ వంటి దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించగల సమర్థమైన అంతర్జాతీయ వ్యవస్థ ప్రస్తుతం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఐక్యరాజ్యసమితి తన సామర్థ్యానికి తగ్గట్లుగా పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత వ్యవస్థ విఫలమవుతోందని పేర్కొన్నారు. 

రూబియో బుధవారం న్యూయార్క్‌లో విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ వ్యవస్థ తన అసలు పరిధిని దాటి అనేక అంశాల్లో జోక్యం చేసుకుంటోందని అన్నారు. అదే సమయంలో ప్రధాన ఘర్షణలను మాత్రం పరిష్కరించలేకపోతోందని చెప్పారు. ఐరాస సర్వసభ్య సమావేశాల సందర్భంగా పలువురు దేశాధినేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.

“భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తలెత్తే ఉద్రిక్తతలను పరిష్కరించగల వ్యవస్థ ఉంటే బాగుండేది” అని రూబియో అన్నారు. థాయ్‌లాండ్‌-కంబోడియా మధ్య జరిగిన ఘర్షణను కూడా ఆయన ప్రస్తావించారు.

అంతర్జాతీయ వ్యవస్థ సరిగా పనిచేయని పరిస్థితుల్లో ప్రతి దేశం తన ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని రూబియో స్పష్టం చేశారు. అమెరికా కూడా జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోదన్నారు. అంతర్జాతీయ వ్యవస్థ కంటే అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

రూబియో వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చాయి. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య గతేడాది జరిగిన ఘర్షణను తానే ఆపినట్లు ట్రంప్‌ ఐరాసలో చేసిన ప్రసంగంలో మరోసారి చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే కాల్పుల విరమణ విషయంలో భారత్‌ మొదటి నుంచీ మరో వాదనను వినిపిస్తోంది. ఇరు దేశాల సైన్యాల డైరెక్టర్‌ జనరల్స్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవోలు) నేరుగా మాట్లాడుకుని కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చారని భారత్‌ స్పష్టం చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం లేదని కూడా తేల్చిచెప్పింది.
Advertisement
Marco Rubio
India Pakistan dispute
United Nations
US Foreign Policy
Donald Trump
Global conflict resolution

More Telugu News