తనకు పుట్టబోయే పిల్లలపై గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్

Samantha past comments on her future children go viral now
  • సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సమంత 'మా ఇంటి బంగారం'
  • సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించిన సామ్
  • తన బిడ్డే తన ప్రపంచం అవుతుందని గతంలో చెప్పిన సమంత  

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అటు ప్రొఫెషనల్ లైఫ్‌లో, ఇటు పర్సనల్ లైఫ్‌లో ఫుల్ హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మరోవైపు ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఒక క్రేజీ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


తాజాగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌తో కూడిన ఆనందానికి లోనయ్యారు. ఈ విషయంపై ఆమె సన్నిహిత వర్గాలు స్పందిస్తూ.. సమంత, రాజ్‌లకు ఇది చాలా ప్రత్యేకమైన సమయమని, వారిద్దరూ లైఫ్‌లో ఒక కొత్త జర్నీకి సిద్ధమవుతున్నారంటూ ఇన్‌సైడ్ లీక్ ఇచ్చారు. దీనిపై సామ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరోవైపు, గతంలో ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి సామ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి బాల్యం గడిపిన వారంతా తమ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సినిమాలను పక్కన పెట్టి, తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా" అంటూ అప్పట్లోనే సామ్ తన మనసులోని మాటను బయటపెట్టింది.
Go Back to Shorts
Samantha
Samantha pregnancy rumors
Maa Inti Bangaram success
Samantha baby bump
Samantha motherhood comments
Samantha and Raj

More Telugu News