‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

Drishyam 3 Telugu OTT release stayed by High Court key orders
  • తెలుగు వెర్షన్‌ను నిలిపివేస్తూ మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • తెలుగు రీమేక్‌ హక్కులు తమవేనంటూ దర్శకురాలు శ్రీప్రియ పిటిషన్‌
  • గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్‌
  • ఈ నేపథ్యంలో తెరపైకి హక్కుల వివాదం
  • జూన్‌ 18 నుంచి స్ట్రీమ్‌ కావాల్సిన తెలుగు వెర్షన్‌కు అడ్డంకి
మోహన్‌లాల్‌ నటించిన ‘దృశ్యం 3’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు ఓటీటీలో విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. తెలుగు హక్కులపై వివాదం తలెత్తడంతో మద్రాస్ హైకోర్టు తాత్కాలికంగా విడుదలను నిలిపివేసింది.

తెలుగులో ‘దృశ్యం’ తొలి భాగాన్ని తెరకెక్కించిన దర్శకురాలు శ్రీప్రియ, ఆమె సంస్థ రాజ్‌కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టును ఆశ్రయించాయి. ‘దృశ్యం’ ఫ్రాంచైజీ తెలుగు హక్కులు తమ వద్ద ఉన్నాయని, మూడో భాగాన్ని డబ్బింగ్ రూపంలో విడుదల చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నాయి. ఈ వాదనలను పరిశీలించిన కోర్టు, తదుపరి విచారణ వరకు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయవద్దని ఆదేశించింది. దీంతో జూన్ 18 నుంచి స్ట్రీమ్‌ రావాల్సిన తెలుగు వెర్షన్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలు వెంకటేశ్ హీరోగా తెలుగులో రీమేక్ అయ్యాయి. అయితే మూడో భాగాన్ని రీమేక్ చేయకుండా నేరుగా డబ్బింగ్ వెర్షన్‌గా తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
Advertisement
Drishyam 3
Mohanlal
Madras High Court
Sripriya
OTT release
Telugu dubbing rights

More Telugu News