పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి

Sreemukhi makes interesting comments about her marriage
  • సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానన్న శ్రీముఖి
  • తాను కోరుకున్న వ్యక్తి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటానని వెల్లడి
  • త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పండి అంటూ నెటిజన్ల స్పందన

యాంకర్, నటి శ్రీముఖి తన పెళ్లి గురించి చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సమంత తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ... “ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అయితే నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను” అని నవ్వుతూ వ్యాఖ్యానించింది. సరైన పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నానని, దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటానని తెలిపింది.


ఈ సందర్భంగా ప్రేక్షకులు, సినీ ప్రముఖులు చప్పట్లతో స్పందించగా, అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు “త్వరలో గుడ్ న్యూస్ చెప్పండి” అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీముఖ కీలక పాత్ర పోషించింది.

Advertisement
Sreemukhi
Sreemukhi marriage
Maa Inti Bangaram
Samantha
Nandini Reddy
Maa Inti Bangaram pre release event

More Telugu News