ముగిసిన బండి భగీరథ్ పోలీసు కస్టడీ.. జైలుకు తరలింపు
- మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టు భగీరథ్ పై ఆరోపణలు
- భగీరథ్ పై పోక్సో కేసు పెట్టిన పోలీసులు
- మూడు రోజుల పాటు భగీరథ్ ను ప్రశ్నించిన పోలీసులు
ఈ కేసు ప్రత్యేక విచారణాధికారి, కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు భగీరథ్ ను విచారించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ కు కూడా ఆయనను తీసుకెళ్లారు. డిసెంబర్ 31న బాధితురాలిని భగీరథ్ తన స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి అఘాయిత్యం చేసినట్టు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే పోలీసు విచారణలో పలు ప్రశ్నలకు భగీరథ్ సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు సమాచారం.