ఏపీలో 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు.. రూ.200 కోట్లతో క్లస్టర్ల అభివృద్ధి: సీఎం చంద్రబాబు
- విజయవాడలో 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' సమ్మిట్
- 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- మెటా, అమెజాన్, జోహో వంటి దిగ్గజ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందాలు
- 45 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులపై ఉత్తర్వులు
- గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక కేంద్రాల ప్రారంభం
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. విజయవాడలో సోమవారం నిర్వహించిన 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మెటా, అమెజాన్, జోహో వంటి ప్రఖ్యాత సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకు అవసరమైన ప్లగ్-అండ్-ప్లే మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే తొలి రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేయగా, వాటిలో కొన్ని ప్రారంభమయ్యాయి.
ఈ సమ్మిట్‌లో భాగంగా, గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో ఏర్పాటు చేసిన 'రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్' ఎక్స్‌టెన్షన్ కేంద్రాలను సీఎం ప్రారంభించారు. అదేవిధంగా, రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటు కోసం రూ.200 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.