నివ్వెరపోయే నిజం... దేశంలో 40 శాతం ఫేక్ న్యాయవాదులే!

Manan Kumar Mishra Reveals 40 Percent Fake Lawyers in India
  • నకిలీ సర్టిఫికెట్లతో కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తింపు
  • డిగ్రీల వెరిఫికేషన్‌కు లాయర్లు దూరంగా ఉన్నట్లు బీసీఐ వెల్లడి
  • ఈ ఉదంతాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లిన బీసీఐ
  • లాయర్ల డిగ్రీలపై సీబీఐ విచారణకు సీజేఐ యోచన
దేశంలో నల్ల కోట్లు వేసుకుని కోర్టుల్లో తిరుగుతున్న న్యాయవాదుల్లో దాదాపు 35 నుంచి 40 శాతం మంది నకిలీవారేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా సంచలన నివేదిక ఇచ్చారు. వీరంతా నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసి లేదా సృష్టించి కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

వెరిఫికేషన్ ఫామ్స్ నింపని లాయర్లు
ఈ నకిలీ డిగ్రీల వ్యవహారాన్ని అడ్డుకోవడానికి బీసీఐ కసరత్తు ప్రారంభించింది. అడ్వొకేట్ల డిగ్రీ సర్టిఫికెట్లను పరిశీలించే ప్రక్రియను బీసీఐ మొదలుపెట్టగా.. దాదాపు 40 శాతం మంది తమ వెరిఫికేషన్ ఫారాలను పూరించలేదు. ఫారాలు నింపని వీరంతా నకిలీ న్యాయవాదులేనని బీసీఐ అనుమానిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దృష్టికి తీసుకెళ్లినట్లు మనన్ మిశ్రా వెల్లడించారు.

కాక్రోచ్‌ జనతా పార్టీ వివాదంపై మరింత క్లారిటీ
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ ఉద్యమం వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా బీసీఐ మనన్‌ కుమార్‌ వివరించారు. గత వారం ఒక పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ లాయర్ల డిగ్రీలపై అనుమానం వ్యక్తం చేశారు. నకిలీ డిగ్రీలతో కోర్టుల్లోకి వస్తున్న యువతను ఉద్దేశించే ఆయన ‘కాక్రోచ్‌’ వ్యాఖ్యలు చేశారని, దీనిపై సీబీఐ విచారణ కోరాలని భావిస్తున్నట్లు సీజేఐ చెప్పారని మిశ్రా స్పష్టం చేశారు.
Go Back to Shorts
Manan Kumar Mishra
Bar Council of India
BCI
Fake Lawyers India
Fake Law Degrees
Cockroach Janata Party
CJI Surya Kant
Lawyers Verification
Indian Judiciary
Legal System

More Telugu News