ఓటీటీకి వచ్చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్!

MrXMovie Update
  • ఆర్య హీరోగా రూపొందిన 'మిస్టర్ ఎక్స్'
  • ఏప్రిల్ 17వ తేదీన విడుదలైన సినిమా
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సాగే కంటెంట్
  • భారీతనమే ప్రధానమైన బలం   
  • ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్

కోలీవుడ్ లో యాక్షన్ హీరోల జాబితాపై ఒక లుక్ వేస్తే, 'ఆర్య' పేరు ముందు వరుసలోనే కనిపిస్తుంది. ఒక యాక్క్షన్ హీరోకి ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్న హీరో అనే విషయం ఆయనను చూడగానే అర్థమైపోతుంది. అందువల్లనే ఆయన ఆ తరహా సినిమాలు ఎక్కువగా చేస్తూ వెళుతున్నాడు. కెరియర్ పరంగా చాలా నిదానంగా ముందుకు వెళుతూ, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలతోనే ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నాడు. 

అలాంటి 'ఆర్య' నుంచి రీసెంటుగా వచ్చిన సినిమానే 'మిస్టర్ ఎక్స్'. మను ఆనంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ఇది. లక్ష్మణ్ కుమార్ - వినీత్ జైన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, నెల తిరిగేలోగానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు (మే 14)నుంచి ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. 1965 నాటి కాలంతో ముడిపడిన ఒక స్పై మిషన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 

గౌతమ్ కార్తీక్ .. శరత్ కుమార్ .. మంజు వారీయర్ .. అనఘ .. అతుల్య రవి .. రైసా విల్సన్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. కనిపించకుండా పోయిన న్యూక్లియర్ క్యాప్సిల్స్ చుట్టూ తిరిగే ఈ కథ, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని మెప్పిస్తుందనే టాక్ వచ్చింది. విజువల్స్ .. యాక్షన్ సీన్స్ .. భారీతనం ఈ సినిమాలో ప్రధానమైన బలంగా నిలిచాయి. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు దక్కించుకుంటుందనేది చూడాలి మరి.

Advertisement
Arya
Mr X movie
Mr X Arya
Tamil movie
OTT release
Jio Hotstar
Action thriller
Gautham Karthik
Sarath Kumar
Manju Warrier

More Telugu News