ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ .. ఒకరి మృతి, పలువురికి గాయాలు
- తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెం వద్ద ఘటన
- మృతుడు రాజాంకు చెందిన సాయి అనిల్ కుమార్‌గా గుర్తింపు
- రాజాం నుంచి విజయవాడ వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన
- క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలింపు
తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సును యర్నగూడెం వద్ద లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రాజాం సమీపంలోని పనసలవలస గ్రామానికి చెందిన నారు సాయి అనిల్ కుమార్ (24)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.