రోప్ తెగి కిందపడిన లిఫ్ట్... తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం
- కరీంనగర్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రమాదం
- రైతును పరామర్శించి వస్తుండగా ఘటన
- మొదటి అంతస్తు నుంచి కిందపడిన లిఫ్ట్
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన లిఫ్ట్‌లో ఉండగా రోప్ తెగిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను బయటకు తీశారు. కరీంనగర్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న ఒక రైతును పరామర్శించేందుకు ఆయన వెళ్ళిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ రోప్ తెగిన ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
మంత్రి రైతును పరామర్శించేందుకు మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ కిందకు వస్తుండగా సాంకేతిక లోపం కారణంగా రోప్ తెగి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయింది. దీంతో మంత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, పోలీసులు లిఫ్ట్ తలుపు తెరిచి మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.