ప్రధాని మోదీ మా ఇంటికి రానుండడం ఎంతో ప్రత్యేకం: చంద్రబాబు

PM Modi Visits Chandrababu Naidu Residence in Hyderabad
  • తెలంగాణ పర్యటన కోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ
  • చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్న వైనం
  • మోదీ రాక తమ కుటుంబానికి ప్రత్యేకమని చంద్రబాబు హర్షం
  • తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ సభకు హాజరుకానున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి విచ్చేయనున్నారు. తెలంగాణ పర్యటన నిమిత్తం నగరానికి వస్తున్న ప్రధాని మోదీ, ఈ మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు. ఇరువురు తాజా రాజకీయ అంశాలపై చర్చించుకోనున్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ మిత్రపక్ష నేత అయిన చంద్రబాబును మోదీ కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రధాని మోదీతో భేటీ కానుండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. "గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు మా నివాసానికి వస్తుండడం, ఆయనకు మేం స్వాగతం పలకనుండడం మాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ఇది మా కుటుంబానికి నిజంగా ఒక ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన క్షణం" అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

కాగా, ప్రధాని మోదీ తన తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇటీవల బెంగాల్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ, ఇప్పుడు తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రధాని సభ ద్వారా శ్రీకారం చుట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. 
Go Back to Shorts
Chandrababu Naidu
Narendra Modi
Hyderabad
Telangana
AP CM
BJP
Political Meeting
Parade Grounds
Secunderabad
Telangana Politics

More Telugu News