భార్యను గదిలో బంధించి.. అత్తపై అల్లుడి లైంగికదాడి

Telangana man arrested for sexual assault on mother in law
  • కుమార్తె కాపురంలో గొడవలు.. సర్దిచెప్పేందుకు వచ్చిన తల్లి
  • భార్యను గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు
  • నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో సర్దిచెప్పడానికి వచ్చిన అత్తపైనే అల్లుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. భార్యను గదిలో నిర్బంధించి ఈ అమానుషానికి ఒడిగట్టాడు. వట్‌పల్లి మండలం ఖదీరాబాద్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖదీరాబాద్ గ్రామానికి చెందిన దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త రోజూ మద్యం తాగి వచ్చి గొడవ పడుతున్నాడని భార్య తన తల్లికి మొరపెట్టుకుంది. దీంతో వారికి సర్దిచెప్పేందుకు తల్లి ఈ నెల 6న కుమార్తె ఇంటికి వచ్చింది. ఆ రోజు కూడా అల్లుడు మద్యం సేవించి భార్యతో గొడవ పడ్డాడు.

ఈ క్రమంలో అత్త అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు, ముందుగా భార్యను ఒక గదిలో బంధించాడు. ఆ తర్వాత అత్తను మరో గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో జోగిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.
Go Back to Shorts
Sangareddy
Sexual assault
Telangana crime
Molestation
Khadirabad
Jogipet police
Domestic dispute
Crime news telangana
Assault
Wife locked room

More Telugu News