తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌లకు డైరెక్టర్ జనరల్ హోదా
- పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- డీజీగా పదోన్నతి పొందినవారిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సజ్జనార్
- లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్న మహేశ్ భగవత్
మహేశ్ భాగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉండగా, స్వాతి లక్రా స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ డీజీగా ఉన్నారు. వీవీ శ్రీనివాసరావు తెలంగాణ పోలీసు నియామక మండలి చైర్మన్‌గా ఉన్నారు. సీఐడీ, మహిళా భద్రతా విభాగం, ఏసీబీ ఏడీజీగా చారు సిన్హా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రేహౌండ్స్ ఏడీజీగా ఉండగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ప్రస్తుతం వీసీ సజ్జనార్ ఉన్నారు.