‘డ్రాగన్’ కోసం కండలు పెంచుతున్న తారక్.. మజిల్స్ ఫొటోతో ఫ్యాన్స్‌కు ట్రీట్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కోసం పూర్తిగా సిద్ధమవుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయనున్న భారీ యాక్షన్ చిత్రం కోసం ఆయన కఠోరంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. కెమెరాకు వీపు చూపిస్తూ, కండలు తిరిగిన తన శరీరాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోకు "కొన్నది కాదు.. కష్టపడి సంపాదించింది" (#BuiltNotBought) అని ఎన్టీఆర్ క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాలో ఆయన పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందోనన్న అంచనాలు మరింత పెరిగాయి. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మీనన్ కూడా నటించనున్నారని సమాచారం. 1969 కాలంలో భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో జరిగే ఎమోషనల్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.