Anil Ambani: వైట్‌హౌస్‌లో పలుకుబడి కోసం.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను ఆశ్రయించిన అనిల్ అంబానీ!
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి, అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడి సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ 'ది న్యూయార్క్ టైమ్స్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. వైట్‌హౌస్‌లో తనకు మంచి పరిచయాలున్నాయని చెప్పుకొని ఎప్‌స్టీన్.. అనిల్ అంబానీకి దగ్గరయ్యాడని, ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుడిగా సలహాలు కూడా ఇచ్చాడని ఆ కథనం వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రభుత్వంలో భారత-అమెరికా సంబంధాలు, రక్షణ సహకారంపై పట్టు సాధించేందుకు అనిల్ అంబానీ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎప్‌స్టీన్‌తో పరిచయం ఏర్పడింది. 2017 నుంచి 2019 మధ్య వీరిద్దరి మధ్య వందలాది మెసేజ్‌లు నడిచినట్లు న్యూయార్క్ టైమ్స్ సమీక్షలో తేలింది. "భారత్-అమెరికా సంబంధాలు, రక్షణ సహకారం విషయంలో వైట్‌హౌస్‌తో కలిసి పనిచేయడానికి మీ మార్గనిర్దేశం అవసరం" అని అంబానీ పంపిన మెసేజ్‌కు, తాను "లోపాయికారీ సమాచారం" అందిస్తానని ఎప్‌స్టీన్ బదులిచ్చాడు.
ట్రంప్ ప్రభుత్వంలోని కీలక నియామకాలు, విదేశాంగ విధానంపై ఎప్‌స్టీన్ ఎప్పటికప్పుడు అంబానీకి సమాచారం చేరవేసేవాడు. 2017లో భారత రాయబారిగా డేవిడ్ పెట్రియస్‌ను నియమిస్తారా అని అంబానీ అడగ్గా, ఆ ప్రతిపాదన పరిశీలనలో లేదని ఎప్‌స్టీన్ చెప్పాడు. ఆ తర్వాత ఆ పదవి కెన్నెత్ జస్టర్‌కు దక్కింది. అంతేగాక ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన స్టీఫెన్ బ్యానన్, థామస్ బరాక్ వంటి వారితో పరిచయం కల్పిస్తానని కూడా ఎప్‌స్టీన్ ఆఫర్ చేసినట్లు కథనం పేర్కొంది. వీరిద్దరూ 'సిగ్నల్', 'టెలిగ్రామ్' వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా సంభాషించుకునేవారని, అంబానీ 'Armani A' అనే హ్యాండిల్‌ను వాడేవారని తెలిసింది.
2019లో అనిల్ అంబానీ వ్యాపారాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు, ఎప్‌స్టీన్ ఆయనకు మానసికంగా ధైర్యం చెబుతూ సందేశాలు పంపాడు. "కేవలం స్నేహితుడిగా మాత్రమే సలహా ఇస్తున్నా, నాకేమీ డబ్బు వద్దు" అని కూడా చెప్పాడు. దీని తర్వాత "లావాదేవీ పూర్తయింది" అని అనిల్ పేరుతో ఎప్‌స్టీన్‌కు ఒక ఈమెయిల్ అందింది. ఆ తర్వాత 2019 మే 23న అంబానీ, మాన్‌హట్టన్‌లోని ఎప్‌స్టీన్ నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ భేటీ జరిగిన రెండు నెలలకే.. మైనర్ బాలికలతో లైంగిక, అక్రమ రవాణా ఆరోపణలపై ఎప్‌స్టీన్ అరెస్ట్ అయ్యాడు. ఈ కథనంపై స్పందించేందుకు అనిల్ అంబానీ నిరాకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.