Iran: యుద్ధం ఆగదు.. అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ
అమెరికాతో 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలన్న ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఈ విషయాన్ని రాతపూర్వకంగా కాకుండా, దాడులను మరింత తీవ్రతరం చేయడం ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం ఒక కథనాన్ని ప్రచురించింది.
ఒక స్నేహపూర్వక దేశం ద్వారా గురువారం అమెరికా ఈ ప్రతిపాదనను ఇరాన్‌కు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల కువైట్‌లోని బుబియాన్ దీవిలో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కాల్పుల విరమణ కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం వల్లే అమెరికా బలగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు ఫార్స్ ఏజెన్సీ విశ్లేషించింది.
మరోవైపు, ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన A-10 "వార్తాగ్" యుద్ధ విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది. అంతకుముందు, ఒక F-35 ఫైటర్ జెట్‌ను కూడా నేలకూల్చినట్లు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. కూలిపోయిన విమానం పైలట్ కోసం గాలిస్తుండగా, అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను కూడా ఇరాన్ గగనతలంలో ధ్వంసం చేసినట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ క్రమంలో, శత్రు పైలట్లను గుర్తించడంలో అధికారులకు సహాయం చేయాలని స్థానిక గవర్నర్ యదొల్లా రహ్మానీ ప్రజలను కోరారు.