జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం... వివరాలు ఇవిగో!

GHMC Revenue Increased in Last Financial Year
  • నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా పెరిగిన ఆదాయం
  • రూ.1,172 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ వెల్లడి
  • అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.36.36 కోట్ల మేర పెరిగిన ఆదాయం
2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు ఆదాయం భారీగా పెరిగింది. మొత్తం రూ.1,172.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

2025 మార్చిలోనే 15,536 నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీకి రూ.1,138.44 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ.34.36 కోట్ల మేర ఆదాయం పెరిగింది. 'బిల్డ్ నౌ' పోర్టల్ ద్వారా జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేసింది.

క్యూర్ అర్బన్ రీజియన్‌లో రూ.2,558.8 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా, జీహెచ్ఎంసీలో రూ.995.82 కోట్లు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.100.36 కోట్లు, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.562.62 కోట్లు వసూలయ్యాయి. మార్చి నెలలో రూ.453 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయిలు వసూలు కాగా, మార్చి 31వ తేదీనే రూ.162.94 కోట్లు వసూలయ్యాయి.
GHMC
Greater Hyderabad Municipal Corporation
Hyderabad
Property Tax
Building Permissions

More Telugu News