Ration Card Telangana: ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కట్టా?.. తెలంగాణలో కలకలం

Ration Card Telangana IT Returns Cause Panic
షార్ట్స్‌లో చూడండి
"మీకు రేషన్‌కార్డు ఉందా? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? వార్షికాదాయం రూ.6 లక్షల కంటే ఎక్కువ చూపించారా? అయితే మీ కార్డు రద్దవుతుంది".. ప్రస్తుతం తెలంగాణలోని గ్రామాల్లో ఈ ప్రచారం లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. స్వయంగా గ్రామ పరిపాలన అధికారులే (జీపీవోలు) ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా విచారణ చేస్తుండటంతో ఈ గందరగోళం నెలకొంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా, క్షేత్రస్థాయిలో విచారణ వేగంగా జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.01 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, వీటిపై 3.25 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. రేషన్ కార్డు కేవలం బియ్యం కోసమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా ఉంది. అయితే, తాజాగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని విచారణ జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 30,186 మంది, సిద్దిపేట జిల్లాలో 14,200 మందిపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా.

అయితే, ఆదాయపన్ను చెల్లించేవారికి, కేవలం రిటర్న్స్ దాఖలు చేసేవారికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. రుణాలు పొందడం కోసం, టీడీఎస్ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడం కోసం చాలామంది తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారు. చిన్న వ్యాపారులు సైతం యూపీఐ లావాదేవీల వల్ల కట్ అయిన పన్నును తిరిగి పొందడానికి రిటర్న్స్ దాఖలు చేస్తారు. 
Go Back to Shorts
Ration Card Telangana
Telangana Ration Card
IT Returns
Income Tax Returns
Ration Card Cancellation
Telangana Welfare Schemes
Mahabubnagar
Siddipet

More Telugu News