Chiranjeevi: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి మెగా 158 షూటింగ్!

Chiranjeevi Mega 158 Movie Shooting to Start in April
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆసక్తికరమైన వార్త. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి పునరావృతం కానుంది. మెగాస్టార్ కెరీర్‌లో 158వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

ఈ నెలాఖరులోగా సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో చిరంజీవిపై కొన్ని సోలో ఎంట్రీ సన్నివేశాలను, ఆ వెంటనే ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న చిరంజీవిని ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నట్టు తెలుస్తోంది. అయితే కేవలం మాస్ అంశాలకే పరిమితం కాకుండా కుటుంబ భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ బాబీ ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవిని సరికొత్తగా ప్రజెంట్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో, ఇండస్ట్రీలోనూ అంచనాలు రెట్టింపయ్యాయి. మాస్, ఎమోషన్ కలగలిపి రానున్న ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందేమో చూడాలి.
Go Back to Shorts
Chiranjeevi
Mega 158
Waltair Veerayya
Bobby Kolli
KVN Productions
Telugu movies
Tollywood
Venkata K Narayana
Lohith
Mass Avatar

More Telugu News