Deepika Padukone: పుకార్లకు చెక్.. భర్త రణవీర్ తో కలిసి సందడి చేసిన దీపికా పదుకొణె
బాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ లంచ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఏదో జరిగిందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, ముంబై వీధుల్లో ఈ జంట సందడి చేసింది.
ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కు లంచ్ కోసం వచ్చిన రణవీర్ సింగ్, దీపికా పదుకొణె అభిమానులను ఖుషీ చేశారు. రణవీర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న తరుణంలో, ఈ జంట ఇలా కలిసి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రణవీర్ సినిమా సక్సెస్‌పై దీపిక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకపోవడం, 'ధురందర్ 2' స్పెషల్ షోకు రాకపోవడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య ఏదో జరిగిందంటూ పుకార్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే, తాజాగా భర్తతో కలిసి లంచ్‌కు వచ్చిన దీపిక.. తన చిరునవ్వుతోనే ఆ వార్తలన్నీ అవాస్తవమని తేల్చేసింది. భర్త సాధించిన భారీ విజయం పట్ల తానెంత గర్వంగా ఉందో ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.