Sundeep Kishan: 'శంబాల' టీమ్‌తో సందీప్ కిషన్ కొత్త చిత్రం... పాన్ ఇండియా స్థాయిలో మూవీ

Sundeep Kishan Announces SK33 with Shambala Director
షార్ట్స్‌లో చూడండి
యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తన కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు (#SK33) 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహించనున్నారు. సూపర్‌హిట్ చిత్రం 'శంబాల'ను నిర్మించిన షైనింగ్ పిక్చర్స్ సంస్థ ఈ మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని సందీప్ కిషన్ శనివారం తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

"సింహాలు, తోడేళ్లు, రాజులు, కత్తులతో మన పురాణాల్లోకి ఒక సాహసోపేత ప్రయాణం" అంటూ సందీప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. ఒకవైపు గర్జిస్తున్న సింహం, మరోవైపు తోడేలు, వాటి మధ్యలో నేలపై పాతిన కత్తితో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. "కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొందరు రాజులు ఎప్పటికీ చనిపోరు" అనే ట్యాగ్‌లైన్ సినిమా కథాంశంపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా, సందీప్ కిషన్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో 'సిగ్మా' ఒకటి. ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. నిధి వేట నేపథ్యంలో సాగే ఈ కథలో కేథరిన్ ట్రెసా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.
Go Back to Shorts
Sundeep Kishan
SK33
Shambala movie
Yugandhar Muni
Shining Pictures
Mythological fantasy adventure
Sigma movie
Jason Sanjay
Faria Abdullah
Telugu Tamil Hindi movie

More Telugu News