N Nagaraju: దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో ట్విస్ట్.. జీవో ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంపై బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రిటైర్డ్ జిల్లా జడ్జిని చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, కొద్ది గంటల వ్యవధిలోనే ఆ జీవోను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అనూహ్య పరిణామంతో నియామక ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ జిల్లా జడ్జి ఎన్ నాగరాజును ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా నియమిస్తూ నిన్న దేవాదాయ శాఖ ఎక్స్-అఫిషియో సెక్రటరీ డాక్టర్ హరి జవహర్‌లాల్ జీవో నంబర్ 447ను జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, జీవోను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే దాన్ని తొలగించారు. ఈ పరిణామంతో అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది.
.