Divya Spandana: ధురంధర్-2పై నటి రమ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Divya Spandana Comments on Durandar 2
షార్ట్స్‌లో చూడండి
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు రమ్య మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన 'దురంధర్-2' చిత్రంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనను తీవ్రంగా నిరాశపరిచిందని, చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయింది.

ఈ నెల 19న విడుదలైన 'దురంధర్-2' చిత్రాన్ని చూసిన అనంతరం రమ్య తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఇది మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్లో మీ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకండి. ఇది ఓటీటీలో చూడాల్సిన సినిమా,’ అని ఆమె పేర్కొన్నారు. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నటన, నేపథ్య సంగీతం వంటి అన్ని విభాగాల్లో సినిమా విఫలమైందని విమర్శించారు. ‘మార్చి 19న విడుదల తేదీ ఉందని బహుశా చిత్రబృందానికి ఎవరూ చెప్పలేదేమో,’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

‘రణ్‌వీర్, నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. దర్శకుడు ఆదిత్య ధర్ జాతీయవాదం, ప్రాపగాండా నుంచి బయటకు రావాలి’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
 
Go Back to Shorts
Divya Spandana
Ramya
Durandar 2
Ranveer Singh
Bollywood Movie Review
Aditya Dhar
Kannada Actress
Political News
Movie Criticism
OTT Release

More Telugu News