Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి రిమాండ్.. చిత్తూరు జిల్లా జైలుకు తరలింపు!

Peddireddy PA and Key Follower Remanded
షార్ట్స్‌లో చూడండి

మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో భూములకు సంబంధించిన కీలక దస్త్రాల దహనం కేసులో సీఐడీ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ మునితుకారాం, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.


ఈ కేసులో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న వీరిద్దరినీ నిన్న సీఐడీ పోలీసులు గాదంకి టోల్‌ప్లాజా వద్ద చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు నిందితులను ప్రత్యేక సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న ఇన్‌ఛార్జి జడ్జి, నిందితులకు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు వారిని చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.

Go Back to Shorts
Peddireddy Ramachandra Reddy
Munithukaram
Madhava Reddy
Andhra Pradesh CID
Madanapalle RDO Office
Land Records Arson Case
Chittoor District Jail
YSRCP Leader

More Telugu News