Pakistan Energy Crisis: ముడిచమురు నిల్వలు 11 రోజులకే సరిపోతాయి.. సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్

Pakistan energy crisis hits with 11 days of crude oil reserves
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో కేవలం 11 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు మాత్రమే ఉండటం ఇంధన భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది.

పెట్రోలియంపై ఏర్పాటైన సెనేట్ స్టాండింగ్ కమిటీకి అధికారులు ఈ వివరాలు అందించారు. దేశంలో ప్రస్తుతం 21 రోజులకు సరిపడా డీజిల్, 27 రోజులకు పెట్రోల్, 9 రోజులకు ఎల్పీజీ, 14 రోజులకు విమాన ఇంధనం నిల్వలు ఉన్నాయని పెట్రోలియం కార్యదర్శి తెలిపారు. పాకిస్థాన్ తన పెట్రోలియం అవసరాల్లో దాదాపు 70 శాతం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటోంది. తాజా ఘర్షణల కారణంగా కీలకమైన నౌకా మార్గాలు దెబ్బతిన్నాయి. ఎర్ర సముద్రం మీదుగా సరుకు రవాణాకు గతంలో 4-5 రోజులు పట్టగా, ఇప్పుడు 12 రోజులు పడుతోంది.

మరోవైపు పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం కూడా పొంచి ఉంది. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో తీవ్రమైన ద్రవీకృత సహజ వాయువు (LNG) కొరత ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు. మార్చిలో రావాల్సిన ఎనిమిది ఎల్ఎన్‌జీ కార్గోలలో కేవలం రెండే పాకిస్థాన్‌కు చేరాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హ‌ర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అనుమతి కోసం ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది.

పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం ప్రతిరోజూ ఇంధన నిల్వలపై సమీక్ష నిర్వహిస్తోంది. ప్రస్తుతానికి మార్చి నెలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ఏప్రిల్ మధ్య వరకు సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. 
Go Back to Shorts
Pakistan Energy Crisis
Pakistan crude oil
Pakistan fuel shortage
Middle East tensions
Red Sea shipping
LNG shortage
Iran oil transport
Hormuz Strait
Pakistan petroleum imports

More Telugu News