Thummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు

Thummala Nageswara Rao Announces Good News for Farmers
షార్ట్స్‌లో చూడండి

రైతులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు అందించారు. ఈ నెల 22వ తేదీన సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు సంక్షేమం ఆగకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయకపోయినా, రైతుల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇవాళ్టి నుంచే కొనుగోళ్లను ప్రారంభించిందని తుమ్మల వెల్లడించారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో రేపు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని చెప్పారు. ఈ సందర్భంగా నర్మెటలో మూడు రోజుల పాటు భారీ వ్యవసాయ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Thummala Nageswara Rao
Rythu Bharosa
Telangana farmers
Revanth Reddy
Maize procurement
Oil palm factory
Narmetta
Siddipet
Agriculture exhibition
Farmer welfare

More Telugu News