Revanth Reddy: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Reacts to Moinabad Farmhouse Drugs Case
షార్ట్స్‌లో చూడండి
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ఎనిమిది మందికి నిబంధనల మేరకే స్టేషన్ బెయిల్ వచ్చిందని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రిగా తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు.

ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశామని అన్నారు. ఏపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు నిబంధనల మేరకు స్టేషన్ బెయిల్ వచ్చిందని తెలిపారు. 2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోవని జోస్యం చెప్పారు. 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ముందుగానే వస్తే సంతోషిస్తామని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నాయకులతో కలిసి ఆయన అధిష్ఠానం పెద్దలతో సమావేశమయ్యారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు పరిచయం చేశారు.
Go Back to Shorts
Revanth Reddy
Moinabad farmhouse drugs case
Telangana CM
Putta Mahesh
Telangana Assembly Elections 2028

More Telugu News