KD The Devil: 'KD' మూవీ సాంగ్ వివాదం.. నోరా ఫతేహి పాటపై అర్మాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్!

KD The Devil Song Controversy Armaan Malik Shocking Comments on Nora Fatehi Song
షార్ట్స్‌లో చూడండి
ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'KD: ది డెవిల్'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన 'సర్కే చునర్ తేరీ సర్కే' పాట ఇప్పుడు వివాదాలకు చిరునామాగా మారింది. ఈ పాటలోని సాహిత్యం రెండర్థాలతో కూడి, మహిళలను కించపరిచేలా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ఈ పాటపై సింగర్ అర్మాన్ మాలిక్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "నా టైమ్‌లైన్‌లో ఈ పాట కనిపించింది. నేను విన్నది నిజమేనా? అని ఒకటికి రెండుసార్లు ప్లే చేసి చూశాను. కమర్షియల్ సాంగ్ రైటింగ్ ఇంత దిగజారిపోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. మాటలు రావడం లేదు, ఆ పాటను వినకుండా ఉంటే బాగుండేది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పాటకు రాకీబ్ ఆలం సాహిత్యం అందించగా, అర్జున్ జన్య సంగీతం ఇచ్చారు. ప్రముఖ గాయని మంగ్లీ ఈ పాటను పాడారు. అయితే, పాటలోని కొన్ని లైన్లు అత్యంత అసభ్యంగా ఉన్నాయని, ఇది కేవలం డబుల్ మీనింగ్ మాత్రమే కాదని, పచ్చి బూతు అని నెటిజన్లు మండిపడుతున్నారు. 

నోరా ఫతేహి డ్యాన్స్‌ను కొందరు మెచ్చుకున్నప్పటికీ, సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ పాటలో కనిపించడంపై విమర్శలు వస్తున్నాయి. 'ధురంధర్' వంటి భారీ హిట్ తర్వాత సంజయ్ దత్ ఇలాంటి 'చీప్' పాటల్లో నటించడం ఏంటని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. కన్నడ సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారంటూ కొందరు నెటిజన్లు డైరెక్టర్ ప్రేమ్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Go Back to Shorts
KD The Devil
Dhruva Sarja
Armaan Malik
Nora Fatehi
Sanjay Dutt
Mangli
controversial song
Sarkhe Chunar Teri Sarkhe
Rakib Aalam
Arjun Janya

More Telugu News