Tadipatri Rakesh: అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి

Warangal man Tadipatri Rakesh dies of heart attack in Virginia
షార్ట్స్‌లో చూడండి
ఉన్నత చదువులు చదివి, అమెరికాలో స్థిరపడ్డ ఓ తెలుగు యువ ఇంజినీర్ హఠాన్మరణం చెందాడు. వరంగల్‌కు చెందిన తాడిపత్రి రాకేశ్ (40) వర్జీనియా రాష్ట్రంలో గుండెపోటుతో మరణించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా, రాకేశ్ వరంగల్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త జితేందర్ కుమారుడు.

గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రాణిస్తూ అక్కడే స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం వర్జీనియాలో నివాసముంటోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న రాకేశ్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Go Back to Shorts
Tadipatri Rakesh
Tadipatri Rakesh death
Warangal
Virginia
Heart Attack
Software Engineer
USA
Telugu News

More Telugu News