Donald Trump: చైనాను కూడా అడుక్కుంటున్నాడు.. ట్రంప్ ను ఎగతాళి చేసిన ఇరాన్

Iran mocks Trump for seeking Chinas help
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తత ఇరాన్, అమెరికాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. హర్మూజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని ఇరాన్ ఎగతాళి చేసింది. అమెరికా చివరకు తన బద్ధశత్రువు చైనాను కూడా సాయం కోరడంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

‘‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం అని చెప్పుకునే అమెరికా.. ఇప్పుడు తన నౌకల రక్షణ కోసం ఇతర దేశాల ముందు యాచిస్తోంది. చివరకు చైనాను కూడా బతిమాలుకునే స్థాయికి ట్రంప్ దిగజారారు’’ అని ఇరాన్ అధికారులు ఎద్దేవా చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా తన పట్టును కోల్పోతోందని, అందుకే మిత్రదేశాల చుట్టూ తిరుగుతోందని ఇరాన్ మీడియా పేర్కొంది. హర్మూజ్ జలసంధి కేవలం తమ నియంత్రణలోనే ఉంటుందని, పరాయి దేశాల నౌకలు ఇక్కడ గస్తీ కాయడం అసాధ్యమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ స్పష్టం చేసింది.

మరోవైపు, హర్మూజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయంగా చమురు రవాణా అస్తవ్యస్తమైంది. ఈ మార్గం ద్వారానే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలు తమ సొంత రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని ట్రంప్ సూచించారు. అయితే, అమెరికా విజ్ఞప్తిపై చైనా కానీ, ఇతర దేశాలు కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ విదేశీ యుద్ధనౌకలు జలసంధిలోకి ప్రవేశిస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Go Back to Shorts
Donald Trump
Iran
US Iran tensions
Hormuz Strait
China
Persian Gulf
Oil transport
Middle East crisis
USA
Iran foreign policy

More Telugu News