రూ.22 వేల పెట్టుబడితో రూ.3.5 లక్షల ఆదాయం: మోదీ ఏఐ వీడియోపై స్పందించిన కేంద్రం
- ఈ వీడియో నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడి
- ఆ వీడియోల కింద ఇచ్చిన లింక్స్‌పై క్లిక్ చేయవద్దని సూచన
- మోదీ మాట్లాడుతున్నట్లుగా ఉన్నది ఏఐ జనరేటెడ్ వీడియో అని వెల్లడి
ఆ వీడియోల కింద ఇచ్చిన లింక్స్‌పై క్లిక్ చేయాలని సైబర్ నేరగాళ్ళు సూచిస్తున్నారు. వాటిపై క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశముంది. ఈ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవి ఏఐ జనరేటెడ్ నకిలీ వీడియోలని వెల్లడించింది.
ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్లుగా ఏఐ ద్వారా డిజిటల్‌గా సృష్టించిన ఈ వీడియో పూర్తిగా నకిలీదని తెలిపింది. ప్రధాని మోదీ లేదా ప్రభుత్వం ఇలాంటి ఏ పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని, ప్రోత్సహించలేదని తెలిపింది. ఇలాంటి పోస్టులతో ఉన్న లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, అలాగే మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఏఐ ఆధారిత ఆర్థిక మోసాలకు గురికావొద్దని అప్రమత్తం చేసింది.