YS Jagan: చంద్రబాబు ఉప ప్రధానా?.. జగన్ రియాక్షన్ వైరల్!

Chandrababu Naidu Deputy Prime Minister Jagan Reaction Viral
  • చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ ప్రచారం
  • ఉప ప్రధాని అవుతారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు
  • ఈ వార్తలపై తనదైన శైలిలో స్పందించిన వైఎస్ జగన్
  • రాష్ట్ర ప్రజలే భరించలేకపోతున్నారు.. దేశం ఏం భరిస్తుంది? అంటూ ఎద్దేవా
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఉప ప్రధాని అవుతారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలే చంద్రబాబును భరించలేకపోతున్నారని, ఇక దేశ ప్రజలు ఎలా భరిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

ఇవాళ‌ ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ‌తారని, ఉప ప్రధాని అవుతారని ప్రచారం జరుగుతోంది కదా అని జగన్‌ను ప్రశ్నించారు. దీనికి జగన్ బదులిస్తూ, "చంద్రబాబు ఉప ప్రధానా? ఎవరు చెప్పినారు సామీ.. గొప్ప సంగతే ఇది. చంద్రబాబును ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలే బరాయించలేకున్నారు.. ఉప ప్రధానిగా దేశ ప్రజలు ఏం బరాయిస్తారు" అంటూ సెటైర్లు వేశారు.

ఇటీవల సోషల్ మీడియాలో చంద్రబాబు జాతీయ రాజకీయ ప్రవేశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవిని వదులుకుని రాజ్యసభకు వెళ్లవచ్చనే వార్తల నేపథ్యంలో చంద్రబాబు కూడా అదే తరహాలో ఏపీ సీఎం పదవిని వదిలి కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఉప ప్రధాని అవుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ ప్రచారంపై జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
YS Jagan
Chandrababu
YS Jagan Mohan Reddy
TDP
YSRCP
Andhra Pradesh Politics
Deputy Prime Minister
National Politics
Narendra Modi
Nitish Kumar
Political News

More Telugu News