ఇరాన్‌పై అమెరికా యుద్ధంతో ప్రయోజనం పొందుతున్న దేశం రష్యా: ఈయూ అధ్యక్షుడు
- పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయన్న అధ్యక్షుడు
- ఈ యుద్ధం వల్ల గెలిచిన వారెవరైనా ఉన్నారా అంటే అది రష్యా మాత్రమేనని వ్యాఖ్య
- బ్రస్సెల్స్‌లో ఈయూ రాయబారుల సమావేశంలో ఈయూ అధ్యక్షుడు
ఉక్రెయిన్‌పై రష్యా నాలుగేళ్లుగా యుద్ధం చేస్తోందని, ఈ యుద్ధాన్ని కొనసాగించడానికి తాజా ఇంధన ధరల పెరుగుదల మంచి ఆర్థిక వనరుగా మారిందని అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల పైనే ప్రధాన దృష్టి ఉండటంతో ఉక్రెయిన్‌పై కొంత శ్రద్ధ తగ్గిందని అన్నారు. తద్వారా రష్యా ప్రయోజనం పొందుతోందని అన్నారు. అంతర్జాతీయ చట్టాలను అమెరికా సవాల్ చేస్తోందని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఈయూపై ఉందని ఆంటోనియా కోస్టా పేర్కొన్నారు.
ఈ అంశంపై చర్చించేందుకు పశ్చిమాసియాలో భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే తాటిపైకి రావాల్సి ఉందని అన్నారు. బాంబుల ద్వారా స్వేచ్ఛా, మానవ హక్కులు సాధించలేమని అన్నారు. అంతర్జాతీయ చట్టాల ద్వారానే ఇది సాధ్యమని అన్నారు. ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం కాకుండా చూడాలని లేదంటే పశ్చిమాసియా, యూరప్‌తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ముప్పేనని అన్నారు.