Iran: హోర్ముజ్ వద్ద అమెరికా దళాల కోసం వేచి చూస్తున్నాం: ఇరాన్ హెచ్చరిక
- చమురు రవాణాకు అమెరికా కీలక నిర్ణయం
- హోర్ముజ్ వద్ద నౌకలకు రక్షణగా తమ బలగాలు ఉంటాయన్న అమెరికా
- అమెరికా బలగాలను ఎదుర్కొనేందుకు వేచి చూస్తున్నామన్న ఐఆర్జీసీ
- 1987 నాటి సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్‌టన్ సంఘటనను గుర్తుకు తెచ్చుకోవాలని ఇరాన్ హితవు
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దీనితో తమ భద్రతా బలగాలు హోర్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణగా ఉండేందుకు సిద్ధమయ్యాయని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. చమురు రవాణాకు కీలకమైన ఈ హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా బలగాలను ఎదుర్కొనేందుకు వేచి చూస్తున్నామని ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) హెచ్చరించింది.
హోర్ముజ్ మీదుగా చమురు నౌకలకు రక్షణగా తమ బలగాలు వెళతాయని అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ప్రకటించారు.
ఐఆర్జీసీ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ మీడియాతో మాట్లాడుతూ, అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు 1987లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్‌టన్‌కు జరిగిన ప్రమాదాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల ఆ దేశ చమురు ట్యాంకర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్నామని గుర్తు చేశారు.
1987లో కువైట్‌కు చెందిన బ్రిడ్జ్‌టన్ ట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళుతుండగా నాటి ఉద్రిక్తల కారణంగా అమెరికా నౌకాదళం ఆ నౌకకు రక్షణ కల్పించింది. ఆ నౌకను ఐఆర్జీసీ లక్ష్యంగా చేసుకుంది. ఫార్సీ దీవుల సమీపంలో నౌక వెళ్లే మార్గంలో నీటి అడుగున పేలుడు పదార్థాలను ఏర్పాటు చేసి దాడికి పాల్పడింది. అయితే ఈ పేలుడులో నౌక దెబ్బతిన్నప్పటికీ ప్రయాణంలో ఇబ్బంది రాలేదు. మొత్తానికి లక్ష్యాన్ని చేరుకుంది.