Ali Khamenei: ఖమేనీని తుదముట్టించాలని అప్పుడే నిర్ణయించాం.. అప్పుడు అమెరికాకు చెప్పలేదు: ఇజ్రాయెల్ మంత్రి వెల్లడి

Israel Planned to Eliminate Khamenei Six Months Ago Says Minister
  • నెతన్యాహూ నేతృత్వంలో గత సంవత్సరం సమావేశమైనట్లు వెల్లడి
  • ఖమేనీని అడ్డు తొలగించాలని ఆ సమావేశంలోనే నిర్ణయించుకున్నామన్న కాట్జ్
  • ఆ సమయంలో అమెరికాకు విషయం చెప్పలేదన్న కాట్జ్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని తుదముట్టించాలని ఇజ్రాయెల్ సుమారు ఆరు నెలల క్రితమే నిర్ణయించిందా? అంటే అవుననే అంటున్నారు ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్. ఖమేనీని అంతమొందించాలని గత సంవత్సరం నవంబర్‌లో నిర్ణయించుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక విషయం వెల్లడించారు.

ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం చివరలో తమ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి భద్రతా సమావేశం జరిగిందని ఆయన తెలిపారు. ఖమేనీని తొలగించాలని ఆ సమావేశంలోనే నిర్ణయించుకున్నామని అన్నారు.

ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతోన్న దాడి వాస్తవానికి 2026 మధ్యలో జరగాల్సి ఉందని తెలిపారు. తమ ప్రణాళిక గురించి నాడు అమెరికాకు తెలియజేయలేదని అన్నారు.

అయితే గత నెలలో ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చర్చించుకున్నారని కాట్జ్ తెలిపారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం మధ్యలో జరగాల్సిన ఆపరేషన్, ముందుగానే ప్రారంభమైందని అన్నారు.
Ali Khamenei
Israel
Iran
Benjamin Netanyahu
Katz
Donald Trump
Israel Iran conflict
Iran protests

More Telugu News