తమ యుద్ధనౌకను ముంచిన 24 గంటల్లో.. అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

Iran Attacks US Tanker After Warship Sinking
  • శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచిన అమెరికా
  • గల్ఫ్‌లోని అమెరికాట్యాంకర్‌పై దాడి చేసిన ఇరాన్
  • 24 గంటల్లో అమెరికాపై ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్
హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధనౌక ఐరిస్ దేనాపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో ఒక అమెరికన్ ట్యాంకర్‌ను ఢీకొట్టినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయిటర్స్ పేర్కొంది. అమెరికా నౌక మంటల్లో చిక్కుకుందని ఇరాన్ మీడియా తెలిపింది. శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాపై జరిగిన దాడికి అమెరికా కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది.

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని, ఇక్కడి నుంచి ప్రయాణించే నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ ప్రకటించింది. అనంతరం శ్రీలంక సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసి, ముంచివేసింది.

దీనితో గల్ఫ్‌లోని అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. శ్రీలంక దక్షిణ తీరంలో తమ యుద్ధనౌకను ముంచిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరాన్ అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసింది.
Advertisement
Iran
US Tanker Attack
Iranian Warship
IRIS Dena
Persian Gulf
Strait of Hormuz
America
Israel

More Telugu News