ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ఎలా ముంచేసిందంటే... వీడియో ఇదిగో!
- శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా
- జలాంతర్గామి టార్పెడో దాడిలో 87 మంది సిబ్బంది మృతి
- 32 మందిని రక్షించిన శ్రీలంక నౌకాదళం
- దాడి వీడియోను విడుదల చేసిన అమెరికా రక్షణ శాఖ
ఇరాన్ నౌక నుంచి అందిన అత్యవసర సమాచారంతో శ్రీలంక నౌకాదళం రంగంలోకి దిగింది. గాలింపు చర్యలు చేపట్టగా, ఘటనా స్థలంలో నౌక పూర్తిగా మునిగిపోయిందని, కేవలం ఆయిల్ మరకలు, లైఫ్ జాకెట్లు మాత్రమే కనిపించాయని శ్రీలంక నౌకాదళం వెల్లడించింది. నీటిలో తేలియాడుతున్న సిబ్బందిని గుర్తించి 32 మందిని రక్షించామని, 87 మృతదేహాలను వెలికితీశామని తెలిపింది. రక్షించిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో కొంతమందికి అత్యవసర చికిత్స అవసరమైందని వెల్లడించింది. కాగా, ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.