మోదీ ఇజ్రాయెల్ ను వీడిన 48 గంటల తర్వాత ఇరాన్‌పై దాడి... ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..?
- మోదీ ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోయాక దాడికి అవకాశం వచ్చిందన్న రాయబారి
- మోదీ పర్యటనలో దేశాభివృద్ధి గురించి మాత్రమే చర్చించినట్లు వెల్లడి
- యుద్ధం గురించి ఆయనతో చర్చించలేదని స్పష్టీకరణ
ఇరాన్‌పై దాడికి, మోదీ పర్యటనకు సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై దాడి ఒక ఆపరేషనల్ అవకాశమని అన్నారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోయాక ఆ అవకాశం వచ్చిందని తెలిపారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో దేశాభివృద్ధి గురించి మాత్రమే చర్చించామని, యుద్ధం గురించి ఆయనతో చర్చించలేదని స్పష్టం చేశారు.
ఆ సమయానికి దాడులు చేస్తామనే విషయం మాకు కూడా తెలియదని అన్నారు. మోదీ వెళ్లిపోయాక ఇరాన్‌పై దాడి గురించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇరాన్‌పై దాడులకు ఫిబ్రవరి 28న ఉదయం సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆ తర్వాతే దాడులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ దాడులకు సంబంధించి చాలాకాలం ముందు నుంచి అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని, అది ఇప్పుడు కుదిరిందని రూవెన్ అజర్ తెలిపారు.