Israel Katz: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎంపికైనా నిర్మూలిస్తాం: ఇజ్రాయెల్ ప్రకటన
- ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కుమారుడు ఎన్నికైనట్లు వార్తలు
- ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునే వారిని అంతమొదిస్తామని రక్షణ మంత్రి
- సుప్రీం లీడర్‌గా ఎవరు వచ్చినా వదిలి పెట్టేది లేదని హెచ్చరిక
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యే వ్యక్తిని కూడా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మృతి చెంది నాలుగు రోజులైనా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ మంత్రి నుంచి ఈ కీలక ప్రకటన వచ్చింది.
ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునే వారిని, అమెరికాను బెదిరించే ప్రయత్నం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. ఈ ప్రాంతంతో పాటు ప్రపంచ దేశాలను అణిచివేయడానికి, బెదిరించడానికి ఆ దేశ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడినైనా నిస్సందేహంగా అంతం చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. సుప్రీం లీడర్‌గా కొత్తగా ఎవరు ఎన్నికైనా, ఎక్కడ దాక్కున్నా వదిలి పెట్టబోమని అన్నారు.
అమెరికా భాగస్వామ్యంతో, ఇరాన్ పాలన సామర్థ్యాలను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబాను దేశ సుప్రీం లీడర్‌గా ఇరాన్ అసెంబ్లీలోని కీలక నేతలు ఎన్నుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)తో బలమైన సంబంధాలు కలిగిన అతను త్వరలో బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నుంచి కీలక ప్రకటన వెలువడింది.