DK Shivakumar: నేను, సిద్ధరామయ్య పాలు, తేనె లాంటి వాళ్లం: డీకే శివకుమార్
- సీఎం మార్పుపై ఇప్పటివరకూ చర్చించలేదని స్పష్టీకరణ
- పార్టీలో విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర అంటూ ఆరోపణణ
- కాంగ్రెస్‌లో అసమ్మతి లేదు.. అంతా ఐక్యంగా ఉన్నామని వెల్లడి
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు, నాయకత్వలేమిపై వస్తున్న వార్తలకు డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ (డీకే) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పూర్తి ఐక్యత ఉందని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తన అనుబంధం 'పాలు-తేనె' లాంటిదని ఆయన అభివర్ణించారు.
మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన డీకే శివకుమార్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన వివరణను సమర్థించారు. విపక్ష నాయకులు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని, సీఎం అనుభవంతో మాట్లాడారని కొనియాడారు. "మా ఇద్దరి మధ్య బంధం పాలు-తేనెలా కలిసిపోయింది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది" అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఇప్పటివరకూ ఎలాంటి చర్చ జరగలేదని డీకే స్పష్టం చేశారు. అలాగే, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా తాను ఆరేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మార్చి 10న ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేపీసీసీ అధ్యక్ష పదవిలో తన కొనసాగింపుపై స్పందిస్తూ.. కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమైనవని సీఎం సిద్ధరామయ్య ఇదివరకే కొట్టిపారేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, కానీ తాము పార్టీ హైకమాండ్‌కు కట్టుబడి ఉన్నామని ఇద్దరు నేతలు మరోసారి స్పష్టం చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మార్పు విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డీకే తెలిపారు.