Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం.. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య

Mother Kills Two Children and Commits Suicide in Yadadri Bhuvanagiri
  • కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను చంపిన తల్లి
  • అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య
  • భర్తతో విభేదాలే కారణమని ప్రాథమిక అంచనా
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కుటుంబ కలహాలు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. భర్తతో ఉన్న విభేదాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్, ఐశ్వర్య దంపతులు. కొంతకాలంగా వీరి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం రోజే ఆమె కుటుంబసభ్యులు నచ్చజెప్పి తిరిగి అత్తగారి ఇంట్లో వదిలివెళ్లారు.

అయితే, పుట్టింటి నుంచి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం జరిగింది. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను దిండుతో ఊపిరాడకుండా చేసి ఐశ్వర్య చంపేసింది. అనంతరం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ దారుణానికి కారణమని కావొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోరంతో గొల్లగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Yadadri Bhuvanagiri
Gollagudem
Family Dispute
Suicide
Child Murder
Andhra Pradesh News
Crime News
Domestic Violence
BB Nagar

More Telugu News