Ali Khamenei: అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి

Ali Khamenei Killed in US Israel Attack on Iran
  • ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార క్షిపణి దాడులు
  • పశ్చిమాసియాలో భగ్గుమన్న ఉద్రిక్తతలు.. ప్రపంచ దేశాల ఆందోళన
  • సంయమనం పాటించాలని భారత్, ఫ్రాన్స్, ఐరాస పిలుపు
  • ఖొమైనీ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన ఇరాన్
పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ దాడిలో ఆ దేశ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖొమైనీ (86) హతమయ్యారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. 36 ఏళ్లుగా ఇరాన్‌ను శాసిస్తున్న ఖొమైనీ మరణంతో 46 ఏళ్ల షియా పాలన కీలక మలుపు తీసుకుంది.

ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ వెంటనే ఎదురుదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలున్న ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, జోర్డాన్, కువైట్‌లపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. "తమ నిఘా, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖొమైనీ తప్పించుకోలేకపోయారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇదే గొప్ప అవకాశం" అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఖొమైనీ మరణాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ధ్రువీకరించింది. దీంతో ఆ దేశంలో తదుపరి నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు, ఇరాన్‌లోని సుమారు 20 నగరాలపై దాడులు జరిగాయని ఐరాస నివేదికలు చెబుతున్నాయి.

ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలు ప్రమాదకరంగా మారుతున్నాయని, వెంటనే ఆగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి, సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఇరుపక్షాల సైనిక చర్యలను ఖండించారు.
Ali Khamenei
Iran
Israel
America
US military
Middle East conflict
Donald Trump
attack
Qatari
Bahrain

More Telugu News