Geetu Royal: తిరుమలలో గీతూ రాయల్ రీల్స్ రచ్చ.. చర్యలకు టీటీడీ సిద్ధం
- తిరుమలలో సినిమా పాటకు రీల్స్ చేసిన గీతూ రాయల్
- నిబంధనలు ఉల్లంఘించారంటూ భక్తుల నుంచి తీవ్ర విమర్శలు
- విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ, చర్యలకు సన్నద్ధం
- వివాదంపై వ్యంగ్యంగా స్పందించి మరింత చర్చకు దారితీసిన గీతూ
బిగ్‌బాస్ ఫేం గీతూ రాయల్ తిరుమలలో చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తన స్నేహితులతో కలిసి తిరుమల కొండపై సినిమా పాటకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ కూడా తీవ్రంగా స్పందించి, చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
గీతూ రాయల్, మరో నలుగురు యువకులతో కలిసి శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్‌కు వెళ్లే మార్గం, ఘాట్ రోడ్లలో ఓ సినిమా పాటకు వీడియోలు చిత్రీకరించారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ కొండపై రీల్స్, వీడియోల చిత్రీకరణను టీటీడీ నిషేధించింది. ఈ నిబంధనలను పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు లైకులు, ఫాలోవర్ల కోసం వాటిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. గతంలో ఇలాంటి పనులు చేసిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ వివాదంపై గీతూ రాయల్ ఓ వీడియో ద్వారా వ్యంగ్యంగా స్పందించారు. "అందరికీ గుడ్ న్యూస్. నాపై చర్యలు తీసుకుంటారట. అందరూ హ్యాపీగా ఉండండి. ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చేసినందుకు థ్యాంక్యూ. నా సగం జీవితం పోయింది, మిగిలింది కూడా మీరే పోగొట్టండి" అని పేర్కొన్నారు. గీతూ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. కాగా, నిబంధనలను అతిక్రమించిన గీతూ, ఆమె బృందంపై కఠిన చర్యలు తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు.