ఇరాన్‌పై దాడి ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.7 వేలు పెరిగిన బంగారం ధర

Gold Price Soars Rs 7000 After Iran Attack
  • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
  • హైదరాబాద్‌లో రూ.1,73,500 పలికిన 24 క్యారెట్ల పసిడి ధర
  • రూ.3 లక్షలకు చేరువైన కిలో వెండి ధర
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఖరీదైన లోహాల ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే సుమారు రూ.7 వేలు పెరిగింది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,73,500కి, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,54,650కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.3 లక్షలను సమీపించింది. ఈరోజు వెండి ధర భారీగా పెరిగి రూ.2,99,000కు చేరుకుంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ఔన్సు ధర 5,296 డాలర్లు పలకగా, వెండి ఔన్సు 98.82 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Go Back to Shorts
Gold Price
Iran
US Israel conflict
Hyderabad gold rate
Silver price
Gold investment
Geopolitical tensions

More Telugu News