Israel: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్.. వీడియో ఇదిగో!
- సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయం సమీపంలోనే క్షిపణి దాడులు!
- వీధులను కమ్మేసిన దట్టమైన పొగ
- ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీసిన జనం
యుద్ధం ముంగిట రెండు దేశాలు
ఈ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఘర్షణ సద్దుమణిగేలా కనిపించడం లేదు. టెహ్రాన్‌లో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది.